కరోనాతో ఒళ్లు చేసిన మిల్కీ బ్యూటీ.నెటిజన్ల ట్రోలింగ్…!

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో ఓ వెబ్ సిరీస్ కోసం షూటింగ్ లో పాల్గొన్న సమయంలో ఆమెకు కరోనా సోకింది. విపరీతంగా జ్వరం రావడంతో టెస్ట్ చేయించుకున్న తమన్నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంది. అయితే కరోనా నుంచి కోలుకున్న తర్వాత తమన్నా కాస్త బొద్దుగా మారింది. దాంతో కొంతమంది తమన్నా బరువు పెరగడంతో కొంతమంది నెటిజన్లు రకరకాల కామెంట్ల తో ట్రోల్ చేశారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వూ లో తమన్నా మాట్లాడుతూ..కోవిడ్ సోకాక తాను చనిపోతానని ఎంతో భయపడ్డానని తెలిపింది తమన్నా. లక్షణాలు ఎక్కువ కావడంతో జ్వరం ఎక్కువైందని ఆసమయంలో చనిపోతానేమో అని చాలా భయపడ్డానని చెప్పుకొచ్చింది. ఇక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో కాస్త బరువు పెరిగాను..అనంతరం ఓ నెటిజన్ నన్ను ఏంటి ఇలా మారావ్ అంటూ కామెంట్ చేసాడు అని తెలిపింది. తాను ఉన్న పరిస్థితి ఎలాంటిది? అన్నది తెలుసుకోకుండా కొంతమంది ఇలా మాట్లాడుతారని ఆవేదన వ్యక్తం చేసింది తమన్నా. ప్రస్తుతం తమన్నా గోపీచంద్ సరసన సీటీమార్ అనే సినిమా చేస్తుంది. అలాగే సత్యదేవ్ తో ఓ సినిమా చేస్తుంది.