గుడ్లు, దోసకాయ, పండ్లు.. ఫ్రిజ్ లో పెడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి..

-

ఆహార వ్యర్థం కాకూడదన్న కారణంగా ఫ్రీజర్ లో దాచేస్తూ ఉంటాం. ఐతే ఇలా చేయడం వల్ల కొన్ని సార్లు ఆహార పదార్థాల రుచి మారిపోతూ ఉంటుంది. బాక్టీరియా పెరిగి అనవసర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఫ్రీజర్ లో ఎలాంటి ఆహార పదార్థాలు ఉంచాలి. ఏ విధంగా ఉంచాలనేది ఇక్కడ తెలుసుకుందాం.

దోసకాయ

దోసకాయలను ఫ్రీజర్ లో ఉంచడం వల్ల వాటి రుచి మారిపోతుంది. అలాగే దోసకాయలు సాగినట్టుగా తయారవుతాయి.

గుడ్లు

గుడ్లను పగలకొట్టకుండా ఫ్రీజర్ లో ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే, అలా పెట్టడం వల్ల గుడ్డు పెంకు పగిలిపోయే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు బాక్టీరియా చేరుతుంది. దాన్ని మనం ఆహారంగా తీసుకోవడం మంచిది కాదు. ఒకవేళ గుడ్లను ఫ్రీజర్ లో పెట్టాలనుకుంటే, గాలి కూడా వెళ్ళని చిన్న బాక్సు తీసుకుని అందులో గుడ్లను ఉంచి, దాన్ని ఫ్రీజర్ లో పెట్టాలి.

పండ్లు

పండ్లను ఫ్రీజర్ లో పెట్టడం వల్ల దాని రుచిని తగ్గించిన వారవుతారు. అంతే కాదు పండ్లలోని లోపలి భాగం ఎండిపోయినట్టుగా అవుతుంది. అందువల్ల దానిద్వారా అందే పోషకాలు మీ శరీరానికి సరిగ్గా అందవు.

ఫ్రై చేసిన ఆహారాలు

ప్యాకెట్లలో ఉన్న ఫ్రై చేసిన ఆహారాల గురించి వదిలేస్తే, అప్పుడే తాజాగా ఫ్రై చేసిన ఆహారాలను ఫ్రీజర్ లో ఉంచడం వల్ల దానిలోని కరకరలాడే గుణం పోయి సాగినట్టుగా తయారయ్యి, తినడానికి వీల్లేకుండా అవుతుంది.

టమాట సాస్

సాస్ నుండి నీళ్ళు విడిపోయి సాన్ రుచిగా ఉండకుండా తయారవుతుంది. అందుకే నిపుణులు, టమాట సాస్ ని ఫ్రీజర్ లో ఉంచవద్దని సలహా ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news