బరువు తగ్గాలనుకుంటున్నారా? ఐతే వర్కౌట్స్ తర్వాత వీటిని తినడం మానేయండి.

-

లాక్డౌన్ కారణంగా ఇళ్ళలోనే ఉండడం వల్ల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. దానివల్ల బరువు పెరగడం మొదలయ్యింది. చాలామంది ఈ విషయం పట్ల కొంత ఇబ్బంది కి గురవుతున్నారు. బరువు తగ్గించుకోవాలని ప్రయత్నాలు మొదలెడుతున్నారు. మీరు కూడా అందుకోసమే ప్రయత్నిస్తున్నారా? బరువు తగ్గాలని వర్కౌట్లు చేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి. వర్కౌట్స్ చేసిన తర్వాత మీరు తీసుకునే ఆహార పదార్థాలు మీ బరువుని ఇంకా పెంచుతాయని లేదా బరువు తగ్గకుండా చేస్తాయి.

అందుకే వర్కౌట్స్ తర్వాత కొన్ని ఆహారాలని తీసుకోకూడదు. అవేంటో ఇక్కడ చూద్దాం.

అరటి పండు

అరటి పండు ఆరోగ్యానికి చాలా లాభం చేస్తుంది. కానీ వర్కౌట్స్ చేసిన తర్వాత దాన్ని ఆహారంగా తీసుకోకూడదు. వర్కౌట్స్ కి ముందు ఆహారంగా తీసుకోవడం మంచిదే. కేలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండడం వల్ల వర్కౌట్స్ చేసాక తీసుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదు.

మామిడి

వేసవిలో అందరూ ఆరాటంగా తినే పండు మామిడి పండు. పిండిపదార్థాలు, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి వర్కౌట్స్ చేసిన తర్వాత తినడాన్ని తగ్గించాలి. అప్పుడే బరువు తగ్గుతారని గుర్తుంచుకోవాలి.

ఖర్జూరం

ఖర్జూరం లో పోషకాలు అధికంగా ఉంటాయి. కానీ వర్కౌట్స్ చేసిన తర్వాత తినడం మంచిది కాదు. ఇవి కొవ్వును కరిగించే ప్రక్రియను నెమ్మది చేస్తాయి.

ఎండుద్రాక్ష

వర్కౌట్స్ తర్వాత తీసుకోకూడని వాటిలో ఎండుద్రాక్ష కూడా ఒకటి. పోషకాలు అధికంగా ఉండే ఖర్జూరాలను వర్కౌట్స్ చేసిన తర్వాత తీసుకోకూడదు. అప్పటి వరకూ కరిగించిన కొవ్వు దీని ద్వారా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పండ్లని వర్కౌట్స్ చేసిన తర్వాత నివారించాలి.

కొబ్బరి గుజ్జు

కొబ్బరి గుజ్జులో ఉండే కార్బోహైడ్రేట్లు బరువు పెరిగేలా చేస్తాయి. వర్కౌట్స్ చేసిన తర్వాత ఆహారంలో భాగం చేర్చుకోవడం వల్ల బరువు తగ్గాలనుకున్న మీ లక్ష్యం నీరు గారిపోయినట్టే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version