వ్యవసాయ బిల్లులపై కదంతొక్కిన పంజాబీ రైతులు!

-

భారత వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మూడు సరికొత్త బిల్లులకు ఆమోద ముద్ర వేసింది మోదీ ప్రభుత్వం. కానీ ఈ సరికొత్త బిల్లుల వలన అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో… దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రైతులు నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు. ఇందులోని భాగంగానే ఈరోజు పంజాబ్ రాష్ట్రంలో “కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ” సభ్యులు అమృత్‌సర్ లో రైల్వే ట్రాక్‌లపై కూర్చుని వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైలు రోకో నిరసన చేపట్టారు.

మజ్దూర్ సంఘర్ష్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బిల్లులకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 24 నుండి 26 వరకు ‘రైల్ రోకో’ ఆందోళనను నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ఈ అన్నదాతలు రైల్వే ట్రాక్ పై కూర్చొని చేపడుతున్న నిరసనలకు సంబంధించిన ఒక వీడియోని నెట్టింట దర్శనమిచ్చింది. ఈ సరికొత్త వ్యవసాయ సంస్కరణల కారణంగా అన్నదాతలకు మేలు జరుగుతుందని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. కానీ కొందరు కొత్త బిల్లులో కారణంగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news