కొత్త ఆర్థిక సంవత్సరం.. కొత్త పన్ను చట్టాలు.. మార్పులు ఏమిటో తెలుసుకోండి

-

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయింది.. లెక్కలన్నీ మారాయి. ఆదాయపు పన్నుకు సంబంధించి కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు కూడా నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర పన్ను చట్టాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయో చూద్దాం..
పన్ను స్లాబ్‌లు ఈ విధంగా ఉంటాయి: 3 లక్షల నుండి 6 లక్షల మధ్య ఆదాయానికి 5% పన్ను, 6 లక్షల నుండి 9 లక్షల వరకు 10% పన్ను, 9 లక్షల నుండి 12 లక్షల వరకు 15%, 12 లక్షల నుండి 15 లక్షల వరకు 20% 15 లక్షలు దాటితే 30 శాతం ఉంది.
పాత పన్ను విధానంలో గతంలో వర్తించే 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ఇప్పుడు కొత్త పన్ను విధానంలో చేర్చబడింది. ఇది కొత్త పన్ను విధానంలో పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయానికి 37% ఉన్న టాప్ సర్‌ఛార్జ్ రేటు 25%కి తగ్గించబడింది.
ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత జారీ చేయబడిన జీవిత బీమా పాలసీల నుంచి వచ్చే మెచ్యూరిటీ మొత్తం ప్రీమియం ₹5 లక్షలు దాటితే, పన్ను విధించబడుతుంది.
ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు.
పన్ను దాఖలు ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, కొత్త పన్ను విధానంలో ఎక్కువ మంది పాల్గొనడాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నుండి ఒక విధానం ఉంటుంది. , పన్ను చెల్లింపుదారులు తమకు లాభదాయకంగా ఉంటే పాత పన్ను విధానంలోనే అంటిపెట్టుకుని ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news