భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇండియాకు వచ్చే ప్రయాణికులకు సొంత ఖర్చులతో 7 రోజుల పెయిడ్ ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పనిసరి అని పేర్కొంది. అయితే ఈ మార్గదర్శకాలు ఈనెల 8 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. కాగా కరోనా నెగెటివ్ రిపోర్టు ఉన్న వారికి క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. అందరూ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది.
ఈ మేరకు 72 గంటల ముందుగా www.newdelhiairport.in లో స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని తెలిపింది. అంతర్జాతీయ ప్రయాణికులు కరోనా నిబంధనలు, మార్గదర్శకాలను తప్పక పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గర్భిణిలు, పదేళ్ల లోపు పిల్లలు, వృద్ధులు, వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, కుటుంబసభ్యులు, లేదా బంధువుల్లో ఎవరినైనా కోల్పోయిన వారికి 14 రోజుల హోమ్ క్వారంటైన్‌కు అనుమతిస్తామని తెలిపారు.