స్థానిక సంస్థల ఎన్నికల వివాదం ఆంధ్ర రాజకీయాలను కుదిపేసింది. ఒకపక్క కరోనా వార్తలు మరోపక్క స్థానిక ఎన్నికల వాయిదాల వార్తలు ఆంధ్ర ప్రజలను వాయించి పెట్టాయి. దీంతో తాజాగా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు దాదాపు ఆరు వారాల పాటు స్థానిక ఎన్నికలు వాయిదా పడటంతో తాజాగా ఏపీ సర్కార్ సచివాలయాన్ని విశాఖకు తరలించే ఈ విషయంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు వెంటనే కార్యాచరణ సిద్ధం చేసింది. ఉన్నత విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయాలు మరియు ఆదేశాలు జారీ చేశారు. ఏమిటంటే కచ్చితంగా మే నెల చివరాకరికి సచివాలయం మొత్తం విశాఖ పట్టణానికి వెళ్లిపోవాలని అందరూ సిద్ధంగా ఉండాలి దాని కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి విషయాలపై దృష్టి పెట్టాలని చర్చించారు. ఒక్క ఉన్నత విద్యాశాఖ అధికారులకు మాత్రమే కాదు ప్రభుత్వంలో పని చేసే ప్రతి శాఖ సచివాలయం ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే తాజాగా జగన్ ప్రయత్నాలు సరికొత్త వివాదాలను ప్రభుత్వ శాఖల్లో తెచ్చి పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో హైకోర్టు లో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోలేదు. ఎలాంటి కార్యాలయాలను తరలించవవద్దని స్పష్టం చేసింది. దానిపై విచారణ జరుగుతోంది. ఏవైనా కార్యాలయాలను తరలించినా… అధికారుల్నే బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించింది. ఇటువంటి టైంలో సచివాలయం తరలింపు విషయంపై సచివాలయం ప్రభుత్వ అధికారులు తమ పిల్లల భవిష్యత్తు మరియు రెసిడెన్సీ కష్టమవుతుందని జగన్ ఈ నిర్ణయం పై పునరాలోచించుకోవాలని తెలియజేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.