సినీ కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు..!!

-

టాలీవుడ్ సినీ కార్మికులు వేతనాలు చెల్లించాలనే డిమాండ్ తో సమ్మెబాట పట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇక వేతనాలు పెంచే వరకు షూటింగ్ కి హాజరు కాబోమని బుధవారం కార్మికులందరూ సమ్మెకు దిగడంతో తెలుగు సహా హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటున్న కొన్ని భాషల సినిమాల షూటింగ్ లు నిలిచిపోయాయి. అయితే ఈ క్రమంలోనే ఎట్టకేలకు సినీ కార్మికుల డిమాండ్స్ కి నిర్మాతలు తలవంచక తప్పలేదు. ఇక నిజానికి వేతనాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నామని అయితే ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా ఇలా సమ్మె చేపట్టడం సరైంది కాదని.. షూటింగులకు రాకపోతే మేమే షూటింగ్స్ ఆపేస్తామని కూడా హెచ్చరించారు నిర్మాతలు.

ఇక ఫెడరేషన్ భవనం వద్ద పెద్దఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలోని పోలీసులు మోహరించారు. ఇక ఒకరిద్దరు ఆత్మహత్యాయత్నం కూడా చేయడంతో ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఎవరికివారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో భేటీ అయి, తమ వాదనను వినిపించారు. ఇక ఈ విషయంలో తలసాని జోక్యం చేసుకోవడంతో జరుగుతున్న చర్చలు సఫలం అయ్యాయి. రేపటి నుంచి యధావిధిగా సినిమా షూటింగు ప్రారంభం కానున్నాయి.

ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు అధ్యక్షతన సి.కళ్యాణ్ మాట్లాడుతూ ఫిలిం ఛాంబర్ , ఫిలిం ఫెడరేషన్ ద్వారా శాలరీస్ ఇస్తామని తెలిపారు. వేతనాల పెంపు సమస్యపై మీటింగ్ పెట్టుకున్నామని వేతనాలు పెంచడానికి చాంబర్ సభ్యులు కూడా ఒప్పుకున్నారు అని ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని తెలిపారు. అయితే రేపటి నుంచి షూటింగ్స్ మాత్రం యధావిధిగా కొనసాగుతాయని ఆయన వెల్లడించారు జూన్ 24వ తేదీన దిల్రాజు అధ్యక్షతన కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కానుందని , ఆయన ఈ సమావేశంలో విధివిధానాలపై కూడా నిర్ణయం తీసుకుంటారు అని సమాచారం. మొత్తానికి అయితే సినీ కార్మికులు తమ పంతాన్ని నెగ్గించుకున్నారు .శాలరీ లను అధికంగా పొందుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news