రోజురోజుకు పెరిగిపోతున్న ధరలతో మరొక వస్తువుపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసరాల ధరలు సైతం ఆకాశానంటుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో వాహనాల ధరలు సైతం పెరుగుతుండడం గమనార్హం. వాహన కొలుగోలుదారులపై ప్రముఖ వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ మరింత భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. తన మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది హీరో మోటో కార్ప్. పెరిగిన ధరలు ఒక్కో బైక్‌పై రూ.3 వేల వరకు ఉంటుందని వెల్లడించింది హీరో మోటో కార్ప్.
ధరల పెంపునకు పెరిగిన ఉత్పత్తి వ్యయమే కారణమని కూడా హీరో మోటో కార్ప్ తెలిపింది. పెంచిన ధరలు జులై 1 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది హీరో మోటో కార్ప్. అయితే ఏ బైక్‌పై ఎంతమేర పెంచుతున్నామన్న వివరాలను మాత్రం హీరో మోటో కార్ప్ వెల్లడించలేదు. ద్రవ్యోల్బణం కారణంగా ముడి సరుకుల ధరలు పెరిగాయని, ఫలితంగానే ఉత్పత్తి వ్యయం పెరిగిందని ఆ తెలిపింది హీరో మోటో కార్ప్.