మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ బాబాయ్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కోనసాగుతున్నది. కేంద్ర కారాగార అతిథి గృహం కేంద్రంగా మూడు సిబిఐ బృందాలు విచారణ చేస్తున్నాయి. నాల్గవ రోజు విచారణకు కడప పట్టణానికి చెందిన ఇద్దరు ముస్లిం మహిళలు, పులివెందులకు చెందిన బాబు అనే వ్యక్తి హాజరయ్యారు. గతంలో ఇద్దరు మహిళలను పలు కోణాల్లో విచారించింది సీబీఐ. ఈ ఇద్దరు మహిళలలో మున్నా రెండో భార్య ఉన్నట్లు సమాచారం.
ఇద్దరు మహిళలతో పాటు మున్నా చెప్పుల షాప్ లో పనిచేస్తున్న భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు పులివెందులకు చెందిన చెప్పుల వ్యాపారి మున్నాను సీబీఐ అధికారులు విచారించారు. అయితే ఈ విచారణలో రోజు రోజుకు తెరపైకి కొత్త వ్యక్తుల పేర్లు వస్తున్నాయి. అన్ని కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు చేస్తుండడంతో త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.