యూఏఈ సర్కార్ కొత్త చట్టం..!

-

ఎన్నికల వచ్చాయంటే చాలు అందరికీ మహిళా ఓటర్ల గుర్తొస్తారు. ఏ రకమైన ప్రలోభాలకు గురిచేసి మహిళా ఓట్లకు గాలం వేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పటి వరకు లేని ప్రేమాభిమానాలు కురిపిస్తూ ఉంటారు. కానీ యూఏఈ సర్కార్ మహిళల పట్ల కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే మగాళ్లతో పాటు ఆడవాళ్లకు సమాన వేతం చెల్లించాల్సిందేనని కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఈ విషయం స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయెద్ ఆల్ నహ్యన్ అధికారికంగా ప్రకటించారు. ఇకపై దేశంలో పనిచేసే పురుషులతో పాటు మహిళలకు కూడా ప్రైవేట్ సెక్టార్ లు సమాన వేతనం చెల్లించక తప్పదు. సెప్టెంబర్ 25 నుంచి ఈ కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 1980లో చేసిన ఫెడరల్ లా నెంబర్ 08లోని ఆర్టికల్ 32 ప్రకారం మగాళ్లతో పాటు ఆడవాళ్లకు సమాన వేతనం చెల్లించాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు.

 

యూఏఈ జెండర్ బ్యాలెన్స్ కౌన్సిల్ అధ్యక్షురాలు షేఖా మనల్ బింట్ మొహమ్మద్ అల్ మక్తూమ్ మాట్లాడుతూ.. వేతనాలు చెల్లించేటప్పుడు స్త్రీ, పురుషుల ఆధారంగా కాకుండా మార్కెట్ ప్రమాణాల ఆధారంగా నిర్ణయించబడతాయని తెలిపారు. ఈ నిర్ణయంతో మహిళల అభివృద్ధికి తొడ్పడుతుందన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రైవేట్ సంస్థలలో పనిచేసే మహిళలందరికి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news