కస్టమర్స్ కి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలని తీసుకు వస్తోంది. వీటి వలన కస్టమర్స్ చక్కటి ప్రయోజనాన్ని పొందొచ్చు. అయితే ఎల్‌ఐసీ తాజాగా మరో కొత్త పాలసీని తీసుకు వచ్చింది. అదే ధన్ రేఖ పాలసీ. ఈ పాలసీని తీసుకోవడం వలన మంచిగా లాభాలని పొందొచ్చు. దీనిని తీసుకోవడం వలన చేతికి మంచిగా డబ్బులు వస్తాయి.
ఇక ఈ ధన్ రేఖ పాలసీ గురించి పూర్తి వివరాలలోకి వెళితే… మెచ్యూరిటీ సమయంలో కూడా ఒకేసారి డబ్బులు వస్తాయి. కనీసం రూ.2 లక్షల మొత్తానికి ఈ పాలసీ తీసుకోవచ్చు. లిమిట్ మాత్రం లేదు. 90 రోజుల వయసు ఉన్న చిన్న పిల్లల దగ్గరి నుంచి పాలసీ తీసుకోవచ్చు.
గరిష్టంగా 55 ఏళ్ల వయసు ఉన్న వారు పాలసీ పొందేందుకు అర్హులు. 20 ఏళ్లు, 30 ఏళ్లు, 40 ఏళ్ల పాలసీ టర్మ్‌తో ధన్ రేఖ తీసుకొచ్చు. 20 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే మీరు పదేళ్ల వరకు ప్రీమియం చెల్లించాలి. 30 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే 15 ఏళ్లు ప్రీమియం కట్టాలి. 40 ఏళ్ల పాలసీ టర్మ్ ఎంపిక చేసుకుంటే అప్పుడు 20 ఏళ్లు ప్రీమియం కట్టాలి.
ఎల్‌ఐసీ ధన్ రేఖ పాలసీ డిసెంబర్ 13 నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. థర్డ్ జెండర్ వాళ్లు కూడా దీనిని తీసుకొచ్చు. అలానే మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంటోంది. దీని కోసం ఎల్ఐసీ వెబ్‌సైట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎల్‌ఐసీ ఏజెంట్ల ద్వారా కూడా మీరు ఈ పాలసీని కొనుగోలు చేయొచ్చు.