డీ. శ్రీ‌నివాస్ పార్టీ మార‌డంపై వీహెచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..అర‌వింద్ ను కూడా తీసుకురావాలి

డీ. శ్రీ‌నివాస్ పార్టీ మార‌డంపై వీహెచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో
డి. శ్రీనివాస్ అన్నీ అనుభవించారని… పార్టీ కష్టాల్లో ఉన్నపుడు టిఆర్ఎస్ లోకి వెళ్లిపోయారని మండిప‌డ్డారు. డి. శ్రీనివాస్ కుమారుడు బీజేపీలో ఎంపీ అయ్యారని.. నిజామాబాద్ కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. కష్టాల్లో ఉన్నపుడు పార్టీని వీడి, ఇప్పుడు మరలా వస్తే ఎలా అని అడుగుతున్నారు…!? అని పేర్కొన్నారు.

డి.శ్రీనివాస్ కుమారుడు కూడా కాంగ్రెస్ లోకి రావాలి….అలా అయితేనే పార్టీకి ఉపయోగమ‌ని వెల్ల‌డించారు. కేవలం డి.శ్రీనివాస్ చేరిక వల్ల ఉపయోగం ఏమిటో అర్థం కావడం లేదని.. గతంలో చేసిన తప్పు ను సరిదిద్దుకున్నా …తన కుటుంబం అంతా కాంగ్రెస్ కుటుంబం అన్నపుడు అరవింద్ ను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యునిగా పదవీకాలం ముగియనుంది. మళ్ళీ ఇస్తారో లేదో తెలీదు అందుకే టిఆర్ఎస్ వీడుతున్నారని చుర‌క‌లు అంటించారు.