2014 ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ సమయంలో తెలుగుదేశం పార్టీతో బీజేపీతో కలిసి పని చేయడం జరిగింది. ఆ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు తెలపడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ కూటమి పై వ్యతిరేకత రావడంతో పవన్ కూటమి నుండి బయటకు వచ్చేయడం జరిగింది.
ఆ సమయంలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీపై కంటే ఎక్కువగా వైయస్ జగన్ ని విమర్శించడం తో పాటుగా అదే సమయంలో ఎన్నికలలో మొట్టమొదటిసారి పోటీ చేయడం తో చాలా దారుణంగా ఓటమి పాలవ్వడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఆరు నెలలు వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర స్థాయిలో విమర్శించిన పెద్దగా జనసేన పార్టీ రాష్ట్రంలో ప్రభావితం చేసే రాజకీయ పార్టీగా ఆవిష్కరించగా పోవటంతో తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త రాజకీయ మొదలుపెట్టినట్లు సమాచారం.
మేటర్ లోకి వెళితే ఇటీవల బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్…వరుసగా మరోపక్క సినిమాలు ఒప్పుకుంటున్నాడు. అయితే ఇదంతా కొత్త రాజకీయం లో ప్లాన్ ఎత్తుగడ అని రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం కోసం సరికొత్త రాజకీయం ఎత్తుగడలు వేయబోతున్న ఇట్లు జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ మేటర్ ఏంటంటే కేవలం ఇదివరకు జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నట్టుగా ఏపీ ప్రజలు భావించారని…ఈసారి అలా కాకుండా..పార్టీ తరఫున మీడియా ముందు గట్టిగా మాట్లాడే ఓ విభాగం త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ‘పార్టీ అంటే జనసేనాని ఒక్కరే కాదు..’ అనేలా ఆ టీమ్ పనిచేస్తుందట. జూన్ నాటికే జనసేన పార్టీ కొత్త రాజకీయం చూడబోతున్నారని జనసేన పార్టీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. అంతే కాకుండా అభిమానులను కూడా కలుపుకొని పోయే విధంగా అభిమాన సంఘాల్లో కీలక మార్పులు చేర్పులు నాగబాబు దగ్గరుండి చేయనున్నట్లు సమాచారం. మరి ఈ పవన్ కళ్యాణ్ కొత్త రాజకీయం హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో చూడాలి.