ఈ కొత్త రూల్స్ ని ఫాలో అవ్వక పోతే జరిమానా తప్పదు..!

-

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కులను తరచుగా ఉపయోగించే కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ ని ఉండేలా చూసుకోమని ఆగస్టులో ప్రకటించిన విషయం తెలిసిందే. 2021 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనల ప్రకారం, ఖాతాదారులు చెక్కు జారీచేసే ముందు తమ బ్యాంకు అకౌంట్‌లో తగినంత డబ్బు మెయింటెన్ చేయడం తప్పని సరి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

చెక్ ఇచ్చే బ్యాంకు అకౌంట్‌లో తగినంత డబ్బు మెయింటెన్ చెయ్యాలి. లేదు అంటే చెక్ బౌన్స్ అవుతుంది. అలానే చెక్కును జారీ చేసిన కస్టమర్ అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది అని అంది. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH) 24 గంటలూ పని చేస్తుందని… చెక్ క్లియరింగ్ లో ఎలాంటి జాప్యం జరగదు అని అంది.

ఇది ఇలా ఉంటే ఇక నుండి అన్ని రోజుల్లోనూ చెక్ లావాదేవీల ప్రాసెసింగ్ జరుగుతున్నందున.. కస్టమర్లు కనీస బ్యాలెన్స్ ఉంచుకోకపోతే చెక్కులు బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉందని అంది. ఒక వేళ చెక్ బౌన్స్ అయితే జరిమానా తప్పదు. ఇది ఇలా ఉంటే ఒక పేరు లేదా సంస్థ కింద దేశ వ్యాప్తంగా నడుస్తున్న అనేక ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ECS)లను ఏకీకృతం చేసే ఉద్దేశంతో ఎన్ఏసీహెచ్ ని తీసుకు వచ్చింది. ఎన్ఏసీహెచ్ తో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని కేంద్రం భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news