కరోనా కారణంగా ఎంత భీభత్సం జరిగిందో ఇప్పట్లో మర్చిపోలేము. ఇప్పుడిప్పుడే మెల్లగా కరోనా సృష్టించిన స్తంభన నుండి బయటపడుతున్నాము. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసరికి మానవజాతికి ఒక కొత్త వెలుగు వచ్చినట్టైంది. ప్రపంచ దేశాల ప్రజలందరికీ కరోనా పెద్ద పాఠం నేర్పించింది. ఐతే కరోనా లక్షణాల గురించి అందరికీ తెలుసు. వాసన కోల్పోవడం, జలుబు, పొడి దగ్గు, ఒళ్ళూ నొప్పులు మొదలైనవి లక్షణాలుగా ఉన్నాయి. తాజాగా లండన్ పరిశోధకులు తేల్చిన ప్రకారం మరో ఏడు కొత్త లక్షణాలని కనుక్కున్నారు.
కండ్ల కలక, డయేరియా, కండరాల నొప్పులు, అధిక ఉష్ణోగ్రత, నాలుక, గోళ్ల మీద ప్యాచుల్లాగా ఏర్పడడం, విపరీతమైన చలి, గొంతుమంట మొదలైన లక్షణాలు కొత్తగా కనిపించాయని అన్నారు. ఇప్పటికే ఉన్న లక్షణాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొత్తగా మరిన్ని లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగించే విషయమే. ఐతే వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.