సంక్రాంతి తర్వాత జిల్లాకో పార్టీ కార్యాలయం..

-

తెలంగాణలో తెరాసను క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రణాళికను సిద్ధం చేశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ‘తెరాసలో గ్రామ, మండల, నియోజకవర్గ, రాష్ట్రస్థాయి కమిటీలను, అనుబంధ సంఘాల పదవులను వెంటనే భర్తీ చేసి.. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి స్థానంలో ఖాళీ అయిన పార్టీ పదవుల్లోనూ నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. వీటన్నింటి కంటే ముఖ్యంగా… ప్రతీ  జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ఆరు నెలల్లో నిర్మించనున్నట్లు తెలిపారు.

ఈమేరకు ఇప్పటికే 22 జిల్లాల్లో స్థలాల ఎంపిక చేసినట్లు  వివరించారు. పార్టీ సభ్యత్వ నమోదుని ఫిబ్రవరిలో నుంచి భారీ ఎత్తున నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు చొరవ తీసుకొని నెల రోజులపాటు సాధ్యమైనంత ఎక్కువ మందిని ఓటర్ల జాబితాలో చేర్పించాలని దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో పార్టీ శ్రేణుల పనితీరుని ఆకస్మిక తనిఖీ ద్వారా పరిశీలించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే తిరుగులేని శక్తిగా ఎదిగిన తెరాసను పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుపే లక్ష్యంగా పటిష్టం చేసేందుకు కేటీఆర్ రచించిన వ్యూహంతో పార్టీలో నూతన ఉత్సహం పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news