కార్ల షోరూంలో దూరిన మొసలి.. వీడియో

-

Crocodile hulchul in car showroom in mexico

ఓ మొసలి కార్ల షోరూంలో దూరింది. ఈ ఘటన మెక్సికోలో చోటు చేసుకున్నది. షోరూంలో దూరాక.. కార్ల కింద నక్కింది మొసలి. అయితే.. షోరూంలో వస్తున్న శబ్దాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డులు కార్ల కింద దూరిన మొసలి చూసి కంగుతిన్నారు. వెంటనే రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి మొసలిని బంధించి తీసుకెళ్లారు. కార్ల షోరూంకు సమీపంలో ఉన్న గోల్ఫ్ కోర్సు నుంచి తప్పిపోయి మొసలి షోరూంకు వచ్చి ఉంటుందని వాళ్లు అంచనా వేస్తున్నారు. కార్ల షోరూంలో అటూ ఇటూ తిరుగుతున్న మొసలిని వీడియో తీసి షోరూం ఉద్యోగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news