జియో ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆఫర్.. 100 శాతం క్యాష్ బ్యాక్

-

Jio Happy New Year Offer Gives '100 Percent Cashback' on Rs. 399 Recharge

జియో తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇదివరకు ఎన్నో క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించిన జియో.. కొత్త సంవత్సరం సందర్భంగా మరో ఆఫర్ ను ప్రకటించింది. హ్యాపీ న్యూ ఇయర్ పేరుతో వచ్చిన ఈ ఆఫర్ పేరిట 100 శాతం క్యాష్ బ్యాక్ ను అందించనుంది. రూ. 399 తో కస్టమర్లు రీచార్జ్ చేసుకోవాలి. అప్పుడు ఆ క్యాష్ బ్యాక్ ను ఎజియో కూపన్ గా అందిస్తుంది జియో. ఆ కూపన్ ను ఎజియో యాప్ కానీ.. సైట్ లో కాని వెయ్యి రూపాయల కొనుగోలుపై వాడుకోవచ్చు.

399 రూపాయలతో రీచార్జ్ చేసుకున్నాక… మైజియో యాప్ లోని మైకూపన్స్ ఆప్షన్ లోకి వెళ్లి ఎజియో కూపన్ ను చెక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ నూతన, పాత కస్టమర్లకు వర్తిస్తుంది. నిన్నటి నుంచి అంటే డిసెంబర్ 28, 2018 నుంచి జనవరి 31, 2019 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కూపన్లను మాత్రం మార్చి 15, 2019 లోపు ఉపయోగించుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news