కొత్త మలుపు తిరిగిన ఇద్దరమ్మాయిల ప్రేమాయణం

-

కర్నూలు జిల్లాలో టీనేజ్ గర్ల్స్‌ ప్రేమాయణం కొత్త మలుపులు తిరుగుతోంది. వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఒకరిని విడిచి మరొకరు బతకలేమని భావించారు. వారిలో ఒకరికి ఇంటిలో పెళ్లిసంబంధాలు చూస్తుండడంతో.. ఇంటిలో చెప్పకుండా పరారయ్యారు. మమ్మల్ని వేరుచేయకండి.. మేమింటికి తిరిగి రామని తేల్చి చెబుతున్నారు. 10 రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయిన ఈజంట.. ప్రస్తుతం బెంగళూరులో ఉంటోంది. ఇంటికి వచ్చేది లేదని, కలిసి జీవిస్తామని చెబుతున్నారు..

- Advertisement -


కర్నూలులోని సంతోష్ నగర్ కు చెందిన సిమ్రాన్ ,నరసింహారెడ్డి నగర్ కు చెందిన పుష్పలత ప్రేమించుకున్నారు. ఇంటర్ వరకు వెంకటరమణ కాలేజీలో కలసి చదువుకున్నారు. ఓ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో ఇద్దరు పరారయ్యారు. పుష్పలత ఇంటిలో 50 వేల రూపాయలు తీసుకుని వెళ్లిపోయింది. దీంతో తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కర్ణాటకలోని యస్వంత్ పురాలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. షెల్టర్ తీసుకున్నారని సమాచారం. అంతేకాదు వీరు ఓ మహిళా న్యాయవాదిని సంప్రదించారు. ఆ న్యాయవాది ద్వారా తల్లితండ్రులతో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఇద్దరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నామని.. ఇంటికి తిరిగి రామని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు మహిళా న్యాయవాది ద్వారా కర్నూలు పోలీసులతో మాట్లాడిన ఆజంట.. ఇంటికి వచ్చేది లేదని చెప్పారు.

వారిని తీసుకొచ్చేందుకు తల్లితండ్రులు, కర్నూలు పోలీసులు … యశ్వంత్ పురా వెళ్లారు. ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి తల్లిదండ్రుల మాట విని వస్తారో….వారి మాట మీదే ఉంటారో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...