వివేకా కేసులో కొత్త ట్విస్ట్ ఇచ్చిన సీబీఐ

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే ముందు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన సీబీఐ ఇప్పుడు దానిని హత్య కేసుగా మార్చింది. అలానే ఈ కేసు దర్యాప్తు బాధ్యత ఢిల్లీ ప్రత్యేక నేరాల విభాగం 3వ బ్రాంచికి కూడా నిన్న అప్పగించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా డీఎస్పీ దీపక్‌గౌర్‌ నియామకమయ్యారు.

ఐపీసీ 302 (హత్యానేరం) అభియోగంతో సీబీఐ ఈ కేస్ ని రీ- రిజిస్ట్రేషన్‌ చేసింది. ఇక పాత బృందం కరోనా బారిన పడడంతో వివేకా హత్య కేసు దర్యాప్తు కోసం త్వరలో కొత్త బృందం రానుంది. ఇక పాత టీమ్ పులివెందులలో చెప్పుల షాపు యజమాని మున్నాతో పలువుర్ని ప్రశ్నించారు. మున్నా బ్యాంక్‌ లాకర్‌లో భారీగా డబ్బు, బంగారం ఉండటంతో సీబీఐ అతని మీద అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అతడికి అంత డబ్బు ఎలా వచ్చిందో ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news