ఢిల్లీ హైకోర్టు ప్రముఖ న్యాయవాదికి చెందిన నివాసాలు, కార్యాలయాలలో ఆదాయ పన్నుశాఖ అధికారుల సోదాలు నిర్వహించారు..ఢిల్లీ, హర్యానా సహా దేశ రాజధాని పరిపాలన కేంద్రం ( ఎన్.సి.ఆర్) లోని మొత్తం సుమారు 38 ప్రాంతాలలో సోదాలు చేస్తున్నారు..పెద్ద మొత్తంలో నగదు లభించినట్లు ఐ.టి విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది..మధ్యవర్తిత్వం కేసులలో క్లయింట్ల నుంచి న్యాయవాది రెండు కేసులలో మొత్తం 217 కోట్ల రూపాయలు నగదు రూపంలో తీసుకున్నట్లు ఆరోపణలతో సోదాలు చేసినట్లు..ఢిల్లీలోని ఖరీదైన ప్రాంతాలలో లెక్కలలో చూపని డబ్బుతో నివాసాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన ఆధారాలను స్వాధీనం చేసుకుట్లు అధికారుల ప్రకటించారు..రెండు మధ్యవర్తిత్వం కేసులలో వివాదాలను పరిష్కారం చేసినందుకు క్లయింట్ల నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్న న్యాయవాది. ఒక కేసులో 100 కోట్లపైగా నగదు తీసుకున్నారు..మరో కేసులో కేసులో లెక్కలలో 21 కోట్ల రూపాయలు చెక్ రూపంలో తీసుకున్నట్లు ఐ.టి అధికారులు వెల్లడించారు. వివిధ బ్యాంకులలో 10 లాకర్లను గుర్తించి వాటిని స్తంభింపచేశారు ఐ.టి అధికారులు.