రైతులకు శుభ వార్త : పశు కిసాన్ క్రెడిట్ కార్డుతో సులువుగా రుణం..!

-

దేశంలో రైతు అనే వాడు లేడంటే మన నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్లడం కష్టమే. అయితే రైతులు ఇప్పటికి ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పండిన పంట చేతికి వచ్చే సమయానికి ఎదో ఒక విపత్తు కారణంగా పెట్టిన పెట్టుబడి కూడా రాలేక అప్పుల పాలు అయ్యి అవి తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందుకనే రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆదాయం రెట్టింపు చేయాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. లక్షాన్ని సాకారం చేసేందు అన్నదాతల ఆదాయం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ తీసుకువచ్చింది. ఇక్కడ గమనించాలిసిన విషయం ఏంటంటే.. దేశం మొత్తంలో కేవలం ఒక్క రాష్ట్రమే ఈ స్కీమ్‌ను అమలు చేస్తోంది. అదే హరియాణ ప్రభుత్వం.

హరియాణ ప్రభుత్వం రైతుల కోసం పశు కిసాన్ క్రెడిట్ కార్డు అందిస్తోంది. ఈ స్కీమ్‌లో భాగంగా రైతులు సులభంగానే రుణం తీసుకునే అవకాశం ఉంది. రైతులు ఒక్క వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి కాకుండా ఆవులు, గేదెలు వంటి వాటి ద్వారా కూడా ఆదాయం పొందుతున్నారు. అటువంటి వారికి మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో పశు కిసాన్ క్రెడిట్ కార్డును తీసుకువచ్చామని ప్రభుత్వం వివరించింది. ఇప్పటి వరకు 60 వేల మందికి ఈ పథకం ప్రయోజనాలు అందుతున్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే సుమారు 8 లక్షల మందికి ఈ కార్డులు జారీ చేస్తామని హరియాణ ప్రభుత్వం పేర్కొంది. అయితే కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ నిబంధనలే పశు కిసాన్ క్రెడిట్ కార్డుకు కూడా వర్తిస్తాయి. పశు కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కింద రైతులు ఎటువంటి గ్యారంటీ లేకుండా రూ.1.6 లక్షల వరకు రుణం పొందొచ్చు. పశువుల కొనుగోలు, వాటి మెయింటెనెన్స్ వంటి వాటికి గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం పొందొచ్చు. అయితే, రూ.1.6 లక్షల వరకు మొత్తానికి ఎలాంటి గ్యారంటీ అవసరం లేదు. కానీ 1.6 లక్షలు కన్నా ఎక్కువ లోన్ తీసుకుంటే తప్పకుండా గ్యారెంటీ కింద ఎదో ఒక ప్రూఫ్ పెట్టాలి.

ఒక ఆవును కొనుగోలు చేసేందుకు రూ.40 వేల వరకు ఇస్తారు. అలాగే గేదె కొనుగోలుకు రూ.60 వేల వరకు, గొర్రెల/మేకలు కొనుగోలుకు రూ.4 వేల వరకు రుణాన్ని అందిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే కోళ్లు కొనేందుకు కూడా లోన్ అందుబాటులో ఉంది. అయితే పశు క్రెడిట్ కార్డు కావాలని భావించే వారు దగ్గరిలోని బ్యాంకుకు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన నెల రోజుల్లో కార్డు లబ్దిదారుల ఇంటికి వస్తుంది. ఇలాంటి స్కీమ్ మన రాష్ట్రంలోనూ అమలులోకి వస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది కదా.. !!

Read more RELATED
Recommended to you

Latest news