నిన్నటి నుండి బంగ్లాదేశ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్యన మొదటి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో 310 పరుగులకు ఆల్ అవుట్ కాగా, బదులుగా కివీస్ రెండవ రోజు ఆటలో ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు మాత్రమే చేయగలిగింది. సొంతగడ్డపై కివీస్ పై మంచి బౌలింగ్ తో ఒత్తిడి చేయడంలో బంగ్లా సక్సెస్ అయిందని చెప్పాలి. న్యూజిలాండ్ ఆటగాళ్లలో కెప్టెన్ విలియమ్సన్ ఒక్కడే సెంచరీ (104) చేసి ఆ మాత్రం స్కోర్ రావడంలో ఉపయోగపడ్డాడు. ఫిలిప్స్ (42) మరియు మిచెల్ (41) లు ఇతనికి కాస్త సహకారం అందించారు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఒక్కడే నాలుగు వికెట్లు పడగొట్టి కివీస్ ను కట్టడి చేశాడు. మరి ఈ మ్యాచ్ లో కివీస్ పట్టు బిగించాలంటే మరో పరుగులు అయినా రేపు ఉదయం చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత బంగ్లాను 200 పరుగుల లోపే కట్టడి చెయ్యాలి. మరి కివీస్ ఈ మ్యాచ్ లో బంగ్లాను ఓడించి మొదటి టెస్ట్ లో విజయాన్ని అందుకుందా అన్నది చూడాలి. ఇక కెన్ విలియమ్సన్ వరుసగా మూడు టెస్ట్ ఇన్నింగ్స్ లలో సెంచరీ లు చేసి రికార్డు సాధించగా, మిగిలిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు.