Ponniyin Selvan 1: మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ టీజర్ లోడింగ్..

-

ఫేమస్ రైటర్ కల్కి కృష్ణమూర్తి రాసిన చారిత్రాత్మక నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఇండియన్ జీనియస్ డైరెక్టర్ మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ అనే చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. తొలి భాగం షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఫస్ట్ పార్ట్ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ ఫిల్మ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయడంపైన ఫోకస్ పెట్టారు.

manirathnam
manirathnam

వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్ర టీజర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల 7న తంజావురూలోని బృహదీశ్వరాలయంలో ఈవెంట్ చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. దేశవ్యాప్తంగా ఈ చిత్రం కోసం సినీ అభిమానులు వెయిట్ చేస్తు్న్నారు. ఇందులో భారీ తారాగణమే ఉంది. ఐశ్వర్య రాయ్, త్రిష ,చియాన్ విక్రమ్ , జయం రవి , కార్తి , జయరాం , ప్రకాష్ రాజ్ , ప్రభు, శరత్ కుమార్, పార్తీబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘పొన్నియన్ సెల్వన్ -2’ ను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

Read more RELATED
Recommended to you

Latest news