జగన్ ప్రభుత్వం-బై జూస్ ఒప్పందం విషయంలో మంత్రి బొత్సకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. సారా సత్తి బాబు మెదడు మోకాల్లోంచి అరికాల్లోకి జారిపోయిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు బుద్ద వెంకన్న. మహా మేత పాలనలో వోక్స్ వాగన్ కంపెనీ తెస్తానని వశిష్ట వాహన్ స్కాం చేసి సొమ్ములు పోనాయి ఎటి సేత్తాం అన్నాడు. ఇప్పుడు యువమేత హయాంలో బైజూస్ కాదు జేజ్యూస్ తెచ్చా సొమ్ములు పొనాయి అంటాడు.
జగన్ లాంటి అవినీతి అనకొండలతో పాటు నీ లాంటి అజ్ఞానులకు అర్థమయ్యేలా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మీడియా సంస్థలు బైజ్యూస్ ముసుగులో జరుగుతున్న దందాని బయటపెట్టారు. ఆ వీడియోని నేను షేర్ చేస్తున్నాను. అన్నట్టు ఇంగ్లీష్ మీడియం అని హడావిడి చేయడమే తప్ప మీ నాయకుడికి, నీకు పూర్తిగా ఇంగ్లీష్ రాదు కాబట్టి మంచి అనువాదకుడుని పెట్టుకొని విషయం తెలుసుకో సారా సత్తి బాబు అంటూ సెటైర్లు వేశారు బుద్దా వెంకన్న.
Budda Venkanna, Botsa Satyanarayana, Latest News, Breaking,