తెలంగాణ‌లో ఐదోరోజు కొన‌సాగుతున్నఆర్టీసీ సమ్మె

తెలంగాణ‌లో ఐదోరోజు కూడా నిర్విరామంగా ఆర్టీసి స‌మ్మె కొన‌సాగుతోంది. అయితే నేటి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. నేడు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. ఆర్టీసీ కార్మికుల భవిష్యత్‌, కార్మికులతో పోరాటం చేసే అంశంపై చర్చించనున్నారు.

26 డిమాండ్లతో పాటు విలీనంపై కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇతరత్రా అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు… ఏకంగా ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధమంటున్నట్లు వినవస్తోంది. ఈ క్ర‌మంలోనే సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.