Raja Vikramarka: త‌న విలన్ కి స‌పోర్టుగా నిలిచిన నేచుర‌ల్ స్టార్..!

-

Raja Vikramarka: నేచుర‌ల్ స్టార్ నాని ఏంటీ? త‌న విల‌న్ కు స‌పోర్టు చేయ‌డ‌మేంటీ? అనే డౌట్ వ‌చ్చిందిగా.. నిజ‌మండీ బాబు! ఇంత‌కీ నాని విల‌న్ ఎవ‌రని అనుకుంటున్నారా? అత‌డే యంగ్ హీరో కార్తికేయ‌. నాని వీ సినిమాలో కార్తీకేయ నెటిగివ్ రోల్ పోషించిన విష‌యం తెలిసిందే.. అయితే.. కార్తీకేయ కు హీరో నాని ఎలా స‌పోర్టు చేస్తున్నాడంటే.. కార్తికేయ హీరోగా న‌టించిన రాజా విక్ర‌మార్క చిత్రం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ది హీరో నానినే. అలాగే త‌న వంతుగా ఈ మూవీ ప్ర‌మోష‌న్ల‌లో కూడా నాని పాల్గొనున్న‌రట‌. న‌వంబ‌ర్ 1న సాయ‌త్రం 4 గంట‌ల 15 నిమిషాల‌కు ట్రైల‌ర్‌ను చుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేయ‌బోతున్నారు.

ఆర్ ఎక్స్ 100 తో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కార్తికేయ. ఈ మూవీ తరువాత‌.. కార్తికేయ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. వరుసగా.. హిప్పీ, గుణ 369, 90ML వంటి సినిమాలతో అలరించిన కార్తికేయ.. ఇటీవల చావు కబురు చల్లగా సినిమాతో ముందుకు వ‌చ్చిన బాక్సాఫీసు వద్ద బోల్తా ప‌డ్డాడు. కానీ.. కార్తికేయ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం.. రాజా విక్రమార్క. యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీలో తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా న‌టించింది. హ్యాపీడేస్ ఫేమ్ సుధాక‌ర్‌ కోమాకుల కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆదిరెడ్డి, 88 రామా రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత‌లు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. సినిమా కూడా న‌వంబ‌ర్ 12న విడుద‌ల‌వుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news