నిన్న ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్యన జరిగిన మూడవ వన్ డే లో బట్లర్ సేన అన్ని రంగాలలో ఆధిపత్యాన్ని కనబరిచి నాలుగు వన్ డేల సిరీస్ లో 2 – 1 ఆధిక్యంలోకి వెళ్ళింది. ముందుగా టాస్ గెలిచిన టామ్ లాతమ్ మరోసారి పొరపాటు నిర్ణయం తీసుకున్నాడు.. గత మ్యాచ్ లో సైతం ఛేజింగ్ చేసి ఓడిపోయిన న్యూజిలాండ్… మళ్ళీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 368 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో డేవిడ్ మలన్ 96 పరుగులు, బెన్ స్టోక్స్ 182 పరుగులు చేసి ఇంగ్లాండ్ కు భారీ స్కోర్ ను అందించారు. అనంతరం పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చిన కివీస్ 187 పరుగులకే ఆల్ అవుట్ అయ్యి భారీ ఓటమిని కొని తెచ్చుకుంది.. క్రిస్ వోక్స్ 3, లివింగ్ స్టన్ 3, రీస్ టోఫ్లే 2 వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో ఓటమితో ఇక న్యూజిలాండ్ సిరీస్ గెలిచే అవకాశాలు పోగొట్టుకుంది. మిగిలిన ఆఖరి వన్ డే లో న్యూజిలాండ్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది.
కానీ బౌలింగ్ లో బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ కన్నా చాలా బలహీనంగా ఉండడంతో ఖచ్చితంగా సిరీస్ ను కోల్పోతుంది అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.