టూరిస్టుల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కరోనా నిబంధలని సడలించింది. ఇకపై ఉత్తరాఖండ్ కి వచ్చే పర్యాటకులు కరోనా నెగెటివ్ రిపోర్ట్ తీసుకురావాల్సిన పనిలేదట. హోటల్ లో బస చేసేటపుడైనా నెగెటివ్ రిపోర్ట్ చూపించాల్సిన అవసరం లేదట. ఇంకా గతంలో మాదిరిగా హోటల్ లో కనీసం రెండు రోజులు ఉండాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ ఛీఫ్ సెక్రటరీ ఓం ప్రకాష్ కరోనా నిబంధనలని సడలించారు.
కాకపోతే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు ఖచ్చితంగా స్మార్ట్ సిటీ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందట. ఇకపోతే థర్మల్ స్కానింగ్, సానిటైజేషన్ వంటి కరోనా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుదని తెలిపారు. ఒకవేళ పర్యటనకి వచ్చిన ఎవరికైనా కరోనా ఉందని తెలిస్తే జిల్లా అధికారులకి తెలియజేయాలని, ఆ తర్వాత ప్రభుత్వం సూచించిన ప్రకారం వారికి వైద్యం అందిస్తామని చెబుతున్నాడు. మొత్తానికి అన్ లాక్ 4 దశలో ఉన్న భారతదేశం మెల్లమెల్లగా పూర్తి అన్ లాక్ లోకి వెళ్ళిపోతుందని అర్థం అవుతుంది.