దర్భంగా పేలుడు కేసులో ఎన్ఐఏ దూకుడు.. మళ్లీ కస్టడీకి నిందితులు

-

 హైదరాబాద్: దర్భంగా పేలుళ్ల కేసు నిందితులను ఎన్‌ఐఏ అధికారులు మళ్లీ కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే నలుగురు నిందితులు మాలిక్‌ సోదరులతో పాటు ఖాఫిల్, హాజీసలీంలను వారం పాటు విచారించారు. జులై 16తో వీరి కస్టడీ ముగియనుంది. దీంతో నిందితులను బీహార్ నుంచి ఢిల్లీకి తరలించారు. అనారోగ్యం కారణంగా హాజీ సలీంను ఇప్పటి వరకూ విచారించలేదు. కాగా దర్భంగా పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది.

జూన్ 17న బీహార్‌ రాష్ట్రం దర్బంగా రైల్వే స్టేషన్‌లో పేలుడు చోటుచేసకుంది. ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ వద్ద సికింద్రాబాద్‌ నుంచి వచ్చిన రైలు నుంచి ఓ వస్త్రాల వ్యాపారి పార్సిల్ దింపుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ పేలుడుకు సెంటర్ పాయింట్ హైదరాబాద్ పాతబస్తీగా తేలింది.

 

కాగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఇమ్రాన్, నాసిర్ హైదరాబాద్ ఆసిఫ్ నగర్‌లో నివాసం ఉండేవారు. అసిఫ్‌నగర్‌‌లో బట్టల దుకాణం నడుపుతున్నారు. జూన్ 15న కారులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఇద్దరు సోదరులు రైల్వే కౌంటర్ వద్ద వస్త్రాల పార్శిల్‌ను అందజేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఎన్‌ఐఏ గుర్తించారు.

దర్భంగా పేలుడు వెనుక ఉగ్ర కు‌ట్ర దాగి ఉందని, రసాయనం ద్వారా రైలులో అగ్నిప్రమాదంతో భారీ విధ్వంసం సృష్టించాలన్న లక్ష్యంతోనే నిందితులు దీనికి పాల్పడ్డారని అధికారులు అంచనా వేశారు. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నా

Read more RELATED
Recommended to you

Latest news