‘హరిహర వీరమల్లు’ నుంచి నిధి అగర్వాల్ లుక్ రిలీజ్

వరుస సినిమాలతో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ దూసుకుపోతున్నారు. ఇప్పటికే… వకీల్‌ సాబ్‌ హిట్‌ తో జోష్‌ మీదున్న పవన్‌..వరుసగా మూడు సినిమాలను లైన్‌ లో పెట్టాడు. హిస్టారికల్ ఫిక్షన్ తరహాలో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ముందు నుండి రకరకాల పేర్లు వినిపించాయి. చివరీ సినిమా యూనిట్ సినిమా పేరును ప్రకటించింది… అదే హరిహర వీరమల్లు. లాక్‌ డైన్‌ కు ముందే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ గ్లింప్జ్ రిలీజ్ చేశారు.

ఇందులలో పవన్ ఒక యోధుడిలా కనిపించారు. అయితే.. ఇది ఇలా ఉండగా…తాజాగా హరిహర వీరమల్లు సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తున్న నిధి అగర్వాల్‌ ఫస్ట్‌ లుక్‌ ను రిలీజ్‌ చేసింది చిత్రం బృందం. నిధి అగర్వాల్‌… పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇక ఈ పోస్టర్‌ లో నిధి అగర్వాల్‌… సంప్రదాయకరమైన గెటప్‌ లో కనిపిస్తోంది. కాగా.. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.