అదిరిపోయే ఆఫర్ కొట్టేసిన నిధి అగర్వాల్.. ఇక కెరీర్ పీక్స్ అంతే..!?

ఎనర్జిటిక్ స్టార్ రామ్… సెన్సేషనల్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ అనే ఫుల్ మాస్ మూవీ తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ కీలక మలుపు తిరిగింది అన్న విషయం తెలిసిందే. అప్పటి వరకు అవకాశాల కోసం చూస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగిన నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగు తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటోంది.

కాగా ప్రస్తుతం హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని నిధి అగర్వాల్ దక్కించుకున్నట్లు సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ చాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే మాత్రం నిధి అగర్వాల్ కెరీర్ పీక్స్ కి వెళ్ళడం ఖాయం అని అటు సినీ విశ్లేషకులు అంటున్నారు.