విడాకుల తర్వాత అలాంటి పోస్ట్ షేర్ చేసిన నిహారిక..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా డాటర్ నిహారిక ఈ మధ్య తన విడాకులు వ్యవహారంతో వార్తల్లో నిలుస్తూ వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. నటిగా, యాంకర్ గా, నిర్మాతగా కూడా కెరియర్ను ముందుకు తీసుకువెళ్తోంది. ఇలాంటి సమయంలోనే తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈమె విడాకుల తర్వాత అమ్మాయిల గురించి చెబుతూ చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట చాలా వైరల్ గా మారింది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రతి విషయాన్ని షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా విడాకుల తర్వాత ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోని మనం గమనించినట్లయితే విడాకులు వ్యవహారం ముగిసాక నిహారిక కాస్త ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఒక నలుగురు స్నేహితురాళ్ళతో కలిసి సరదాగా గడుపుతున్న ఫోటో ఆమె షేర్ చెయ్యగా నిహారికకు స్నేహితులే ఎక్కువ.. ఎప్పుడు వారితోనే గడుపుతూ ఉంటుంది అంటూ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

అంతేకాదు ఆ వీడియో షేర్ చేస్తూ..అమ్మాయిలు ఇలా ఉంటారంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రతి అమ్మాయిల గ్యాంగ్ లో కూడా నాలుగు రకాల అమ్మాయిలు ఉంటారంటూ తనను తాను ఉద్దేశిస్తూ ఎప్పుడు ఒకరు మంచిగా డ్రెస్సింగ్ వేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు అని కూడా చెప్పింది. ఇంకొకరు ఎప్పుడు ఏది వేసుకున్న కాన్ఫిడెంట్ గా ఉంటారని మరొకరు ఎప్పుడు కనీసం రెడీ అయ్యేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపరని.. చివరికి ఒక మహాతల్లి ఉంటుంది తాను ఎప్పుడు అసలు కనిపించదు అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ఈమె షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

Read more RELATED
Recommended to you

Latest news