ఏపీ కీలక అధికారుల బదిలీ .. ట్విస్ట్ ఇచ్చిన నిమ్మగడ్డ

-

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది అంటూ ఇద్దరు కీలక అధికారులను బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా ప్రసాద్ లను నిన్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ట్విస్ట్ ఇచ్చరు. ద్వివేది, గిరిజా శంకర్ లని బదిలీ చేయాలని తాను కోరలేదని నిమ్మగడ్డ పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాక ఈ బదిలీల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్నికల కమిషనర్ తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఉండగా బదిలీలు కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు అని అంటుంటారు..ఇక మిగతా కలెక్టర్లు మరి కొందరు పోలీసు అధికారులకు సంబంధించి తాను ఇచ్చిన లిస్ట్ ప్రకారం బదిలీలు చేయాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news