ఏలూరుకు ఏమయింది ? వచ్చింది నిఫా వైరస్సా ?

-

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మొదలయిన వింత వ్యాధి ఏమిటి అనేది ఇంత దాకా ఏమిటనేది కనిపెట్ట లేకపోయారు. దీంతో ఆ వ్యాధి ఏలూరు సహా మొత్తం జనాన్ని గడగడలాడిస్తోంది. ఒకరకంగా ఇది ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముందు కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిన ఈ మహమ్మారి క్రమంగా నగరమంతా విస్తరిస్తోంది. ఈ సమస్య ఏర్పడి మూడురోజులవుతున్నా ఇంకా ఏమిటనేది తేలలేదు. అసలు వ్యాధికి గల కారణాలు తెలియక తలలు పట్టుకుంటున్నారు. నిపుణులైన వైద్య బృందాలకూ ఇది సవాల్‌గా మారింది. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన డాక్టర్లు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు.

స్థానిక డాక్టర్ల నుంచి సమాచారం తీసుకున్నారు. ఫీల్డ్ లెవల్లో కూడా వేరే బృందాలు పర్యటిస్తున్నాయి. ఇప్పటికే 40 మంది పేషేంట్స్ నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. కొత్తగా మరో 30 మంది పేషేంట్స్ నుంచి సేకరించాలని ఎయిమ్స్‌ డాక్టర్లు సూచించారు. ఫిట్స్‌తో బాధపడుతున్న పేషేంట్స్ వీడియోలు ఉంటే ఇవ్వాలని, లేకుంటే వీడియోలు తియ్యాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రిలో EEE మెషీన్ ఏర్పాటు చేయడంతో పాటు న్యూరాలజిస్టును ఉంచాలని కోరారు. తొలి దశ నమూనా పరీక్షల్లో బాధితుల శరీరంలో సీసం, నికెల్ లోహాలున్నట్టు ప్రాథమిక నిర్దారణ అయినట్ సంగతి తెలిసిందే. అయితే బాధితుల సంఖ్య పెరుగుతోంది. అనేక మంది బాధితులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరినవాళ్లు ఇప్పటి వరకు 200 నుంచి 300  మంది వరకు ఉండొచ్చని అంచనా. ఇక ఇది నిఫా వైరస్ ఆ అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆ లక్షణాలు కనిపించడంతో ఆ అనుమానాలు బలపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news