రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త : ఐదేళ్లపాటు జీఎస్‌టీ నష్టపరిహారం

-

దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు… కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జీఎస్‌టీత నష్ట పరిహారం పై ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌ సభలో కీలక ప్రకటన చేశారు. జీఎస్‌టీ అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగే…. ఆదాయ నష్టానికి ఐదేళ్ళపాటు పరిహారం చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.

ఈ పరివర్తన కాలంలో 2015-16ను ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకుని, ఆ సంవత్సరం ఆదాయంపై సంవత్సరానికి 14 శాతం రెవిన్యూ వృద్ధి ఉండే విధంగా… రాష్ట్రాల రెవిన్యూను కాపాడతామని తెలిపారు. జీఎస్‌టీ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. జీఎస్‌టీ నష్ట పరిహారం పై ఏ రాష్ట్రం కూడా ఆందోళన చెందనవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మల సీతా రామన్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే జీఎస్‌టీ నష్ట పరిహారం పై..  కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని…  ఆమె క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news