క్యాన్సర్ రోగులకు కేంద్ర సర్కార్‌ శుభవార్త..ఇక పై!

-

క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తతులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు నిర్మలా సీతారామన్‌. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ప్రతి జిల్లా ఆస్పత్రి కేంద్రాలలో క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు నిర్మలా సీతారామన్‌. దేశంలోని 200 జిల్లాల్లో క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు జరగనుందని వివరించారు నిర్మలా సీతారామన్‌.

nirmaa

2025 – 2026 సంవత్సరంలోనే ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ‘పత్తి ఉత్పాదకత పెంచేందుకు స్పెషల్‌ మిషన్‌.. అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులు.. అన్ని ప్రభుత్వ స్కూల్స్‌కు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు.. పదేళ్లలో ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు.. ఐఐటీ పాట్నా విస్తరణకు నిర్ణయం.. విద్యారంగంలో AI వినియోగం.. ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్‌ సీట్లు.. బీహార్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ.. రూ.30 వేలతో స్ట్రీట్‌ వెంటర్స్‌కు క్రెడిట్ కార్డులు.. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం’ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news