నేను ఆంధ్రా కోడలినే.. ధైర్యంగా ఉండండి : నిర్మలా సీతారామన్

-

శ్రీకాకుళం : అందరూ తెలుగు రాష్ట్రాల కోడలు అని తనను పిలుస్తారని.. అవును నేను ఆంధ్రా కోడలినేనని పేర్కొన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రధానమంత్రి ఆవాస యోజనలో ఇళ్లు కట్టిస్తున్నామని.. కానీ ఆ ఇళ్లపై మన పేరు లేకుండా కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయని చురకలు అంటించారు. ఇళ్లు , రైతు రుణాలు అన్నింటినీ వారి ఖాతాలో వేసేసుకుంటున్నారని.. దేశంలో 50 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. వ్యాక్సిన్ పై అంతా మీదే పెత్తనమా అని కొన్ని రాష్ట్రాలు ప్రశ్నించాయన్నారు.

కొన్ని రాష్ట్రాలు సమర్ధవంతంగా వ్యాక్సిన్ ను పంపణీ చేశాయని.. కొన్ని రాష్ట్రాలు చేతులెత్తేశాయని మండిపడ్డారు. వ్యాక్సిన్ ను 1500 రూపాయలకు పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అమ్ముకున్నాయన్నారు. ప్రధాని మోదీ దేశం కోసం చేస్తున్న సేవను ప్రజలకు చేర్చాలన్నారు. జనాన్ని మధ్య పెట్టేందుకు ప్రతిపక్షాలు నిత్యం ప్రయత్నిస్తున్నాయని.. ప్రజలకు మంచి చేసే చట్టాలను ఆమోదం పడకుండా పార్లమెంట్ లో అడ్డుకుంటున్నారని నిప్పులు చెరిగారు. చట్టాలు అమలు కాకపోతే ఇంకెప్పుడు మనం ప్రజలకు మంచి చేస్తామన్నారు. బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news