వాటిపైనే మా ఫోకస్.. ఇండియా ఐడియాస్‌ సమ్మిట్‌లో నిర్మలమ్మ

-

ఉపాధి కల్పన, సంపద సమాన పంపిణీపై దృష్టి సారించడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశ ఆర్థిక వృద్ధే తమ ప్రభుత్వం ముందున్న ప్రాధాన్య అంశమని తెలిపారు. ద్రవ్యోల్బణం నియంత్రించగలిగే స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఇతర అంశాలపై దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు. ఇండియా ఐడియాస్‌ సమ్మిట్‌లో ఆమె పాల్గొని మాట్లాడారు.

దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. జూన్‌లో 7.01 శాతం ఉండగా.. జులైలో అది 6.71 శాతానికి తగ్గింది. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా తీసుకుంటున్న చర్యల వల్ల ద్రవ్యోల్బణం అదుపు చేయగల స్థాయికి చేరుకుందన్నారు. ఉపాధి కల్పన, సంపద సమాన పంపిణీ, దేశాన్ని వృద్ధి బాటలోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రాధాన్య అంశాలని వివరించారు.

కొవిడ్‌ వంటి పరిస్థితుల్లోనూ నగదును ముద్రించకుండానే ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నిర్వహించ గలిగామని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల క్రూడాయిల్‌, నేచురల్‌ గ్యాస్‌ అందుబాటుపై అనిశ్చితి కొనసాగొచ్చని అంచనా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news