కాంగ్రెస్‌లో కన్ఫ్యూజన్..మునుగోడు క్యాండిడేట్‌పై ఉత్కంఠ!

-

ఓ వైపు టీఆర్ఎస్ దాదాపు అభ్యర్ధిని ఫిక్స్ చేసి..మునుగోడులో ప్రచారం మొదలుపెట్టేసింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే దాదాపు సీటు ఫిక్స్ చేసింది. ఇక కూసుకుంట్లని వెంటబెట్టుకుని మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు మొత్తం తిరుగుతున్నారు. అటు ఇక్కడ బలంగా ఉన్న కమ్యూనిస్టులు సైతం టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇచ్చింది.

అటు బీజేపీ తరుపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫిక్స్..ఇప్పటికే ఆయన దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలని బీజేపీలోకి తీసుకొస్తున్నారు. ఇంకా తన బలం పెంచుకుంటూ వెళుతున్నారు. కానీ సిట్టింగ్ సీటుగా ఉన్నా సరే ఇక్కడ కాంగ్రెస్ ఇంకా దూకుడుగా ఉండటం లేదు. ఇప్పటికీ అభ్యర్ధి విషయంలో కన్ఫ్యూజ్ అవుతూనే ఉంది.  అసలు అభ్యర్ధిని విషయంలో ఎప్పటిలాగానే నానుస్తూ ముందుకెళుతుంది.  ఇలాగే పనిచేస్తే మునుగోడులో కూడా కాంగ్రెస్ పార్టీకి మూడో స్థానం దక్కుతుంది.

అసలు త్వరగా అభ్యర్ధిని ఖరారు చేసే విషయంలో కాంగ్రెస్ లో ఏకాభిప్రాయం రావడం లేదు. ప్రస్తుతానికి అక్కడ ఇద్దరు నేతలు ఉన్నారు. చల్లమల్ల కృష్ణా రెడ్డి, పాల్వాయి స్రవంతి…ఈ ఇద్దరిలో ఒకరిని అభ్యర్ధిగా పెట్టడానికి తర్జనభర్జన పడుతున్నారు. రేవంత్ రెడ్డి, మాణిక్యం తగురు ఠాగూర్ ఏమో ఆర్ధికంగా బలంగా ఉన్న కృష్ణారెడ్డి వైపు ఉన్నారు. ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి లాంటి వారు ఏమో స్రవంతి వైపు ఉన్నారు.

దీంతో అభ్యర్ధి విషయంలో ఏకాభిప్రాయం రావడం లేదు. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందరూ కూర్చుని ఏకాభిప్రాయంకు వస్తే బాగానే ఉంటుంది…కానీ ఆ పరిస్తితి కనిపించడం లేదు. అటు టీఆర్ఎస్ ఏమో…కాంగ్రెస్ ద్వారా బెనిఫిట్ పొందాలని చూస్తున్నట్లు తెలుస్తోంది…కోమటిరెడ్డి-కాంగ్రెస్‌ని మోసం చేశారని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అంటే ఆ సానుభూతి ద్వారా కాంగ్రెస్ శ్రేణులని తమవైపుకు  తిప్పుకోవాలని చూస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ఎంత త్వరగా అభ్యర్ధిని తెలిస్తే అంత మంచిది…లేదంటా అంతే సంగతులు.

Read more RELATED
Recommended to you

Latest news