నితిన్ హీరో గా నటించిన మాచెర్ల నియోజగవర్గం అనే సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై ఇటీవలే బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..టీజర్ , ట్రైలర్ మరియు పాటలతో ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను రేపిన ఈ చిత్రం విడుదల తర్వాత ఆ అంచనాలను కనీస స్థాయి లో కూడా అందుకోలేకపోవడం బాధాకరం.
నాసిరకం స్టోరీ లైన్ తో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆడియన్స్ కి చిరాకు రప్పించాడు..కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడం వల్ల ఈ సినిమా ఒక్క వర్గం ప్రేక్షకులను కూడా ఆకట్టు లేకపోయింది. ఇది ఇలా ఉండగా.. నితిన్‌తో భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర.. ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.
భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ క్రెడిట్ త్రివిక్రమ్‌కు వెళ్లిపోవడమో లేక మరో కారణమో తెలియదు గానీ.. ఇప్పటి వరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు సాగర్. మధ్యలో వరుణ్ తేజ్‌తో సినిమా ఉంటుందని వినిపించినా.. అది పుకార్లకే పరిమతమైంది. అయితే ఇప్పుడు సాగర్‌కు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రనుందని తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్‌ను సాగర్ కరెక్ట్‌గా వాడుకుంటే.. అతనికి తిరుగుండదని చెప్పొచ్చు.