కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నామనుకునే భాజపాలో లుకలుకలు భయటపడుతున్నాయి… కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్… “నేను పార్టీ అధ్యక్షుడిని అయినప్పుడు, నా పార్టీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు సరిగా పనిచేయనపుడు తప్పెవరిది? నాదే కదా? అంటూ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావిస్తూ, గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భాజపాలో హాట్ టాపిక్ గా మారాయి. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీలను లక్ష్యంగా చేసుకుని, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులను ఉద్దేశించి గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దేశంలో హోమ్ శాఖ సమర్థంగా పనిచేస్తోందంటే, సుశిక్షితులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే కారణం. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల్లో చాలా మంది సచ్చీలురని, చక్కగా పని చేస్తూ, తమ విధులను నిర్వర్తిస్తున్నారని నేను నమ్ముతున్నాను అంటూ ఆయన పేర్కొన్నారు.
పార్టీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు సరిగ్గా పని చేయకపోతే అది పార్టీ అధ్యక్షుడు అసమర్థతగానే భావించాలంటూ… గడ్కరీ వ్యాఖ్యానించడాన్ని పలువురు భాజపా అగ్ర నేతలు సైతం జీర్ణించుకోలేపోతున్నారు. ఇదే సమయంలో ఇండియాలో జరుగుతున్న మతపరమైన ద్వేషం పెరగడాన్ని కూడా గడ్కరీ ప్రస్తావించారు. తొలి ప్రధాని నెహ్రూ ప్రసంగాలంటే తనకు ఇష్టమని చెప్పారు. ఒక్కసారిగా గడ్కరీ వాయిస్ మార్చడాన్ని ఆ పార్టీ నేతల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సొంత పార్టీలో ఇలాంటి విమర్శలు రావడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.