కేరళ కుట్టి నిత్యా మీనన్ కొన్ని సినిమాలు తెలుగులో చేసిన తర్వాత మన ఇంటి అమ్మాయిలాగా మారిపోయింది, అంతలా నిత్యామీనన్ ను ఓన్ చేసుకుని ఆదరించారు, ఇప్పటికీ ఆదరిస్తున్నారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో నిత్య మీనన్ ను ఒక తమిళ్ హీరో వేధిస్తున్నాడన్నట్లు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తను నిజం అనుకున్న అభిమానులు మరియు నెటిజన్లు ఎవరు ఆ హీరో నిత్యామీనన్ ను వేధించింది అంటూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూశారు.. కానీ కాసేపటి క్రితమే నిత్యామీనన్ స్వయంగా ఈ విషయం గురించి మాట్లాడుతూ అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ప్రముఖ ఫిలిం క్రిటిక్ మనోబాల నిత్యామీనన్ ను అడుగగా… ఆమె నేను ఎప్పుడూ ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చింది.
ఈ ఒక్క మాటతో ఈమెను షూటింగ్ లో తమిళ హీరో ఎవరో వేధించారన్న మాటకు ఎండ్ కార్డు పడింది. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఒక్క వార్త లో నిజం ఉంటుందని నమ్మడం కరెక్ట్ కాదు.