జై శ్రీరామ్‌.. ఆయోధ్య రామయ్య ఆలయం ప్రారంభ తేదీ ఖరారు

-

ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్య శ్రీ రామ మందిరాన్ని వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో జరగనున్న ‘రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ’ మహోత్సవానికి దేశం నలుమూలల నుంచి మొత్తం నాలుగు వేల మంది సాధువులు, మత పెద్దలను ఆహ్వానిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు. జనవరి 22వ తేదీనే ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు, ఈ విషయాన్ని ఆయోధ్య ఆలయ నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.అయోధ్య రామమందిరం నిర్మాణం వేగంగా జరుగుతోంది.

ఇప్పటికే మందిరంలో మూడంతస్తుల భారీ రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. 2023 డిసెంబర్‌లోపు గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి కానుంది. ఈ తరుణంలోనే 2024 జనవరి 22న రామ మందిరాన్ని ప్రారంభించాలని ఆయోధ్య ఆలయ నిర్మాణ కమిటీ నిర్ణయించింది. జనవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారని…మోదీ పాల్గొనే తేదీపై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. 2024 జనవరి 14న మకర సంక్రాంతి రోజున ఆయోధ్య రామలల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియ ప్రారంభం కానుంది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు నిర్వహించాలని ఆయోధ్య ఆలయ ట్రస్ట్ నిర్ణయించింది. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత జనవరి 24వ తేదీ నుంచి ఆయోధ్య రామాలయాన్ని భక్తుల కోసం తెరిచే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news