దూసుకొస్తున్న నివర్ తుఫాను.. ఏపీ అంతటా హై అలెర్ట్ !

-

నివర్ తుఫాను దూసుకొస్తోంది. కాసేపట్లో బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారనుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్ష సూచన కూడా ఉందని తెలుస్తోంది. తమిళనాడులోని కరైకల్ – మహాబలిపురం మధ్య తీరం దాటనున్నట్లు చెబుతున్నారు తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కనిపిస్తోంది.

ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే కాకినాడ అమలాపురం తదితర ప్రాంతాల్లోని 13 మండలాల అధికారులకు సెలవులు రద్దు చేశారు రు. 24 గంటల పాటు పని చేసే లాగా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు రెవెన్యూ పోలీసు వైద్య ఆరోగ్య విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే అప్రమత్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news