నేడు తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దర్శించుకోనున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్, సీఎం వైఎస్ జగన్ తిరుపతి రానున్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో 30 నిమిషాల పాటు జగన్ పాల్గొననున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఉదయం పదిన్నర గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
అనంతరం ముందుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి గవర్నర్ దర్శించుకోనున్నారు, ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు విశ్రాంతి గృహానికి రాష్ట్రపతి చేరుకోనున్నారు 1:00 ఐదు నిమిషాలకు మహా ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోనున్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆయన చెన్నై తిరుగు ప్రయాణం కానున్నారు. రాష్ట్రపతి వెంట ప్రభుత్వం తరఫున చిత్తూరుకు చెందిన మంత్రి నారాయణ, నెల్లూరు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొననున్నారు.