ఢిల్లీలో స్కూల్స్ ఓపెన్ చేసే అవకాశమే లేదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మానిష్ సిసోడియా అన్నారు. ఎప్పుడైనా ఓపెన్ చేయవచ్చు అని ముందు భావించిన అక్కడి సర్కార్… ఇప్పట్లో అసలు స్కూల్స్ ఓపెన్ చేసే ఆలోచనే లేదని స్పష్టం చేసింది. దేశ రాజధాని మూడవ మరియు అత్యంత తీవ్రమైన కరోనా వేవ్ ని ఎదుర్కొంటుంది అని ఆయన అన్నారు. ఆ రాష్ట్ర విద్యా శాఖా మంత్రిగా కూడా ఉన్నారు.
“పాఠశాలలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. తల్లిదండ్రులు తమ పిల్లలను సురక్షితంగా ఉంటారని భరోసా వచ్చే వరకు పంపించటానికి ఇష్టపడరు” అని సిసోడియా పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నగరంలోని అన్ని పాఠశాలలు మూసివేస్తామని గత నెలలో ఢిల్లీ సర్కార్ చెప్పింది. పాఠశాలలను తిరిగి తెరవడం సురక్షితమా కాదా అనే దానిపై తల్లిదండ్రుల నుండి అభిప్రాయాలను తీసుకున్నామని అన్నారు.