అంధకారంలో బాసర ట్రిపుల్‌ ఐటీ.. చీకట్లోనే విద్యార్థులు భోజనం

-

నిర్మల్‌ జిల్లాలోనిబాసర ట్రిపుల్ ఐటీని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. వారం రోజుల పాటు ఎండనక వాననక విద్యార్థులు పోరాడినా.. ప్రభుత్వం హామీలతోనే సరిపెట్టుకుంది. విద్యార్థుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని చెప్పినా.. ఆ జాడే కానరావడం లేదు. ఇటీవల ట్రిపుల్​ ఐటీని సందర్శించిన గవర్నర్ తమిళిసై కూడా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. అందరూ అసంతృప్తితో ఉన్నారని చెప్పారు.

తాజాగా.. బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సోమవారం మధ్యాహ్నం నుంచి ట్రిపుల్‌ ఐటీలో కరెంటు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. విద్యార్థులంతా చీకట్లోనే భోజనాలు చేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోవడంతో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్టు అధికారులు వెల్లడించారు. రాత్రి అయ్యాక కూడా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ జరగకపోవడంతో విద్యార్థులంతా అంధకారంలోనే ఉండిపోయారు. మొబైల్‌ ఫోన్‌లు, కొవ్వొత్తుల వెలుగులో రాత్రిభోజనం చేశారు. తరగతి గదుల్లోని మొబైల్‌ ఫోన్ల వెలుగుల్లోనే కొందరు చదువుకుంటూ కనిపించారు.

అయితే, విద్యుత్‌ను ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియడంలేదు. ఆర్జీయూకేటీ డైరెక్టర్‌ సురేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మరమ్మతు పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించనున్నట్టు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news