కరోనా రాకుండా తల నీలాలు సమర్పించారు…!

-

కరోనా గురించి ఎవరికీ తెలిసిన విధంగా వారు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమకు తెలిసిన రీతిలో స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత దూరం పాటించాలి అని అటు ప్రభుత్వాలు, ఇటు who వంటి ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. ప్రాణాలతో భయపడుతూ కొందరు రోజులు లేక్కబెట్టుకునే పరిస్థితికి వచ్చారు అనేది వాస్తవం. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి.

మన పక్కన ఉంది కరోనా బాధితుడు ఎవరు ఉన్నారు ఎవరు కాదు అనేది ఎవరికి తెలియదు. తమకు కరోనా రాకుండా చాలా మంది గ్రామాల్లో కంచెలు వేస్తున్నారు. కరోనా ను నివారించేందుకు తీసుకోవల్సిన అన్ని జాగ్రత్తలు గురించి అన్ని రకాలుగా సమాచారం ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది.

అయినప్పటికీ కొందరు ఈ కరోనా విషయంలో ఆచారాలను కూడా పాటిస్తు ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలోని యువకులు కులదైవానికి తలనీలాలు సమర్పించి కరోనా ను నివారించాలని మొక్కుకున్నారు. ముధోల్ మండలం చింతకుంట తండాలోని 25 మంది యువకులు ఈ విధంగా తమ కులదైవానికి పూజలు చేసి, తలనీలాలు సమర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news